- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని, అర్హులైన వారికి సంక్షేమ కార్యక్రమాలు అందేలా విధివిధానాలు రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మీడియా అకాడమీ చైర్మన్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్, సీపీఆర్వోలతో కలిసి అక్రిడిటేషన్ పాలసీపై చర్చించారు. అర్హులైన జర్నలిస్టుల గౌరవాన్ని కాపాడేలా శాస్త్రీయ పద్ధతిలో పాలసీ ఉండాలని, ఈ నెల చివరినాటికి పాలసీ విధివిధానాలను ఖరారు చేసి, త్వరలో జారీ చేయాలనీ ఆదేశించారు.
- Advertisement -