Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అచ్చంపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి

అచ్చంపేట పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి

- Advertisement -

అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ 
నవతెలంగాణ – అచ్చంపేట

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యక్రమం) కింద బుధవారం అచ్చంపేట పట్టణంలోని వలపట్ల కాలనీ 13వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమం ఘనంగా జరిగింది.  ఈ కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని పట్టణ ప్రాంతాల్లో మరింత పరిశుభ్రంగా, సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. అదనపు కలెక్టర్ చేసిన సూచనలు వలపట్ల ప్రాంతంలోని పరిశుభ్రత, చెత్త నిర్వహణ, కసరత్తులు, ఇతర పారిశుద్ధ్య చర్యల్లో ముందడుగు వేయడానికి మార్గదర్శకంగా ఉంటాయని గుర్తించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గర్లపాటి శ్రీనివాసులు, కమిషనర్ మురళి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -