Saturday, September 27, 2025
E-PAPER
Homeకరీంనగర్ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలు..

ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలు..

- Advertisement -

నివాళులర్పించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ఆచార్య కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించగా,  అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. ఇక్కడ బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి సౌజన్య, డీవైఎస్ఓ రాందాస్, ఆయా శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -