Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి 

పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి 

- Advertisement -

నవతెలంగాణ – మోర్తాడ్ 
విద్యార్థులు పదో తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించి తమ ప్రతిభను కనబరచాలని బడ్జెట్ స్కూల్ అసోసియేషన్ తెలంగాణ సంస్థ జిల్లా అధ్యక్షుడు ఎస్ ఎన్ గిరి అన్నారు. మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను , పెన్నులను పంపిణీ చేశారు. పదో తరగతి పరీక్ష మొదటి మెట్టుగా భావించి విద్యార్థులు లక్ష సాధన దిశగా అడుగులు వేయాలని విద్యార్థులకు సూచించారు. ఉన్నత చదువులకు మొదటి మెట్టుగా పదవ తరగతి కీలకంగా ఉంటుందని తెలిపారు. పతి విద్యార్థి ఉన్నత మార్కులు సాధించి ఉత్తమ ఫలితాలతో మంచి కళాశాలలో సీటు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఫౌండర్ షఫీ, కార్యదర్శి రవీందర్, హరీష్, నాగేష్, శేఖర్ కస్తూరిబా ప్రత్యేక అధికారిని స్వప్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -