ముఖ్యమంత్రిపై తప్పుడు ఆరోపణలను అడ్డుకోవాలి
ఎన్నికల సంఘానికి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మెన్
మెట్టు సాయికుమార్ ఫిర్యాదు
నవతెలంగాణ-సిటీబ్యూరో
కొన్ని మీడియా ఛానల్స్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, నకిలీ సర్వే రిపోర్టులు ప్రసారం చేస్తున్నాయని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మెన్ మెట్టు సాయికుమార్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రధాన ఎన్నికల అధికారి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రముఖ ఛానెల్స్ తోపాటు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్(టీ-న్యూస్ తెలుగు, సిగల్ టీవీ, మిర్రర్ టీవీ, తెలుగు స్కైబ్, న్యూస్ లైన్ తెలుగు, వైఆర్ టీవీ, ప్రీలాన్సర్ రిపోర్టర్ రఘువీర్ రాథోడ్) ఉద్దేశపూర్వకంగా తప్పుడు సర్వేలు, నిర్ధారణ లేని వార్తలు ప్రసారం చేశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలు ముఖ్య మంత్రి ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా, ఓటర్లను తప్పుదారి పట్టించే ప్రయత్నమని అన్నారు. ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకుని, ఇలాంటి దుష్ప్రచారం, నకిలీ సర్వేలు కొనసాగకుండా అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నకిలీ సర్వే రిపోర్టులపై చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



