Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్మిక చట్టాలు అమలు చేయని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి: సీఐటీయూ

కార్మిక చట్టాలు అమలు చేయని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలి: సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
కార్మిక చట్టాలు  చేయకుండా కనీస సౌకర్యాలు  కల్పించకుండా కార్మికులతో వెట్టి చాకిరి  చేయించుకుంటున్న  పరిశ్రమల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అన్నారు. మంగళవారం  సిఐటియు ఆధ్వర్యంలో భువనగిరి భువనగిరి పట్టణ, మండల పరిధిలో ఉన్నపరిశ్రమలలో కార్మిక చట్టాలు అమలు చేయని  పరిశ్రమల యజమానియాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక తహసీల్దారు అంజిరెడ్డి కి వినతి పత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై  సర్వే చేసి  చేయడం జరిగిందని, భువనగిరి పట్టణంలో ఉన్న నివాసం ప్రాంత కార్మికులు అదేవిధంగా భువనగిరి  పట్టణ పరిధిలో ఉన్న ఎల్లమ్మ గుడి పారిశ్రామిక వాడలో కార్మికులు కార్మిక చట్టాలు యాజమాన్యాలు అమలు చేయకపోగా స్థానికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు . నివాస ప్రాంతాల్లో ఉన్న ఆ సంఘటన కార్మికులైన  హమాలీ భవనిర్మానం వివిధ పరిశ్రమలు పనిచేస్తున్న కార్మికులు మున్సిపల్ కార్మికులు వడ్రంగి మోటర్ మెకానిక్  ఎలక్ట్రిషన్స్  లాంటి  కార్మికులు పని  చేసుకుంటూ కుటుంబ జీవనం  గడుపుతున్నారని, కార్మికులకు ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కార్మిక చట్టాలు కూడా అమలు చేయడం లేదనారు. 

కార్మికులు తమ వ్యక్తిగతంగా ప్రభుత్వ రుణం కోసం దరఖాస్తు పెట్టుకునే వ్యక్తిగత కుటీర పరిశ్రమలు నడుపుకోవడానికి  కూడా ప్రయత్నం చేసిన కార్మికులకు ప్రభుత్వం ఎలాంటి సదుపాయం కూడా అందించలేదని ప్రభుత్వం సంఘటిత అసంఘటితరంగా కార్మికులను ఆదుకోవాలని అన్నారు. ఇండస్ట్రీ ఏరియాలో  రిచ్ ఇండియా  కుర్చీల కంపెనీ డాంబర్  ల కంపెనీ వివిధ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు కూడా చెల్లించకుండా కార్మిక చట్టాలు అమలు చేయకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

అదనపు గంటలు పని చేయించుకుంటున్నదని కార్మిక చట్టాలైన ఈఎస్ఐ గాని పీఎఫ్ గానీ ఇన్సూరెన్స్ బోనస్  లాంటి సౌకర్యాలు కల్పించడం లేదని తెలిపారు. కార్మికులు ఎవరైనా వేతనాలు పెంచమని అడిగినా కార్మిక చట్టాలు అమలు చేయమని అడిగినా ఉద్యోగాల నుండి తొలగిస్తామని, యాజమాన్యాల నుండి బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ అధికారులు కార్మిక శాఖ అధికారులు కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు.వెంటనే కార్మిక చట్టాలు అమలు  పరిశ్రమలపై చర్యలు తీసుకొని కార్మికులకు కార్మిక చట్టాలు అమలు చేసి కనీస వేతనాలు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ,  శంకరయ్య, కిష్టయ్య, బాలయ్య, కోటేష్, లక్ష్మయ్య, యుగేందర్, హరీష్, పరమేష్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -