Saturday, July 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలి..

కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలి..

- Advertisement -

పీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్
నవతెలంగాణ – ఏర్గట్ల

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శనివారం రోజున ఏర్గట్ల పోలీస్ స్టేషన్ లో పీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్,డీసీసీ ఉపాధ్యక్షులు శివన్నోళ్ళ శివ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమదేవరెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా పీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ…ఈ నెల 18 వ తేదీన ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేటీఆర్ గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసభ్యకరమైన భాషలో ఏకవచనంలో,అతన్ని అవమాన పరిచేలా మాట్లాడారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు తిట్ల దండకం మొదలు పెడితే మీరు తట్టుకోలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రేండ్ల రాజారెడ్డి, గడ్డం జీవన్, బద్దం లింగారెడ్డి, ముస్కు మోహన్, పన్నాల నర్సారెడ్డి, కురాకుల బొర్రన్న, దండేవోయిన సాయికుమార్, ఇంద్ర, ప్రసాద్ గౌడ్, చిన్న భూమన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -