శాసనసభలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకుల ప్రవర్తన తీరు, స్పీకర్‌నుద్దేశించి దూషణలు చేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. కృష్ణానదిపై ఏవైనా అభ్యంతరాలుంటే, అసెంబ్లీలో చెప్పకుండా, బయట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ)లో చెప్పిన మాటకు కూడా బీఆర్‌ఎస్ సభ్యులు కట్టుబడి ఉండలేదని విమర్శించారు. సోమవారం శాసనసభ జీరో అవర్‌లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ను మూడు ముక్కలు చేస్తారన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. దానిపై ఎలాంటి ప్రస్తావన లేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జీహెచ్‌ఎంసీ పెద్ద ఎత్తున అప్పులు చేసిందంటూ వస్తున్న విమర్శలు సరైనవి కావన్నారు. ఒక రూపాయి కూడా అప్పు చేయలేదని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018-2023 వరకు వివిధ రూపాల్లో రూ. 6601కోట్ల అప్పు చేసిందని గుర్తు చేశారు. ఆ రుణాలకు కనీసం వడ్డీ కూడా చెల్లించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఆ వడ్డీని చెల్లించే ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
బీఆర్‌ఎస్ నేతల ప్రవర్తనపై చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



