Saturday, November 8, 2025
E-PAPER
Homeకరీంనగర్అజాగ్రత్తగా నడిపిస్తున్న డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలి 

అజాగ్రత్తగా నడిపిస్తున్న డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలి 

- Advertisement -

నవతెలంగాణ – వీర్నపల్లి : వీర్నపల్లి మండలం వన్ పల్లి నుండి సిరిసిల్ల రూట్‌ లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ రాష్ డ్రైవింగ్‌ పై ప్రయాణికులు ఫిర్యాదు చేయడం, చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ప్రయాణికులు మాట్లాడుతూ గ్రామాల్లో, గుంతల రోడ్ల వద్ద, మూల మలుపుల వద్ద డ్రైవర్ అజాగ్రత్తగా, వేగంగా బస్సును నడపడం.అల్మాస్ పూర్ వద్ద బస్సు ఒక వైపునకు మొగ్గడం తో ప్రయాణికులు భయాందోళన చెందారు. మెల్లగా పోవాలని చెప్పినందుకు డ్రైవర్ ఎవ్వరికీ చెప్పుతా రో చెప్పుకొండి అంటూ దురుసుగా మాట్లాడారు.రాష్ట్రంలో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో, ప్రమాదాలు జరుగక ముందే ఈ రాష్ డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -