నవతెలంగాణ – ముధోల్
సీసీరోడ్డు పనులు చేయకుండా బిల్లులు తీసుకునే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముధోల్ నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకురాలు పి. రమాదేవి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులు కొందరు ప్రొసీడింగ్ లు తీసుకొని, పనులు చేయకుండా సంబంధిత అధికారుల సహాయంతో బిల్లులు ఆన్లైన్ చేసుకున్నారని ఆరోపించారు. ముధోల్ మండలం లోని ఎడ్ బిడ్ గ్రామంలో అధికార పార్టీ నాయకులు సి సి రోడ్డు పనులు చేయకుండా బిల్లులు మంజూరు చెహించుకోవడం అవినీతికి పాల్పడడమే అని ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ విషయం పై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పనులు చేయకుండా బిల్లులు మంజూరు చేయించుకున్న నాయకులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ముధోల్ మండలమే కాకుండా పలు గ్రామాల్లో అధికార పార్టీ నాయకులు, కొందరు ఇటువంటి వాటికి పాల్పడుతున్నారని అన్నారు. ఉపాధి హామీ సిసి రోడ్లు, మురికి కాలువల నిర్మాణంల పై పూర్తి విచారణ జరపాలని కోరారు.
పనులు చేయకుండా బిల్లులు తీసుకునే వారిపై చర్యలు తీసుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES