- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఒకటో వార్డు ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుడు బి ఆర్ ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆర్ సుభాష్ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ఉద్యమకారునికి జనాలంతా జై కొడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన వెంట భారీ సంఖ్యలో జనాలు పాల్గొంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడే కాకుండా మంచి విద్యావంతుడైన ఆర్ సుభాష్ ఒకటో వార్డులో ఘన విజయం సాధిస్తాడనే చర్చలు జనాల్లో జోరుగా వినబడుతున్నాయి. ఈ ఉద్యమకారుడు బి ఆర్ ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఈశ్వరమ్మ ప్యానల్ లో పోటీ చేస్తున్నారు.
- Advertisement -



