నవతెలంగాణ – కామారెడ్డి
బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు బిఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నేతలు శనివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. యంకె ముజీబోద్దీన్, ఆశన్నగారి జీవన్ రెడ్డి, కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీశ్ రావు మాట్లాడుతూ.. నాయకులను, కార్యకర్తలు రానున్న మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో ఎన్నికలలో వహించవలసిన వ్యూహాలు, పార్టీ కార్యకర్తల ప్రేరణపై చర్చించగా, ప్రతి నియోజకవర్గంలో సక్రియత పెంపొందించే మార్గాలు నిర్ణయించారు. బిఆర్ఎస్ నాయకులు ఎన్నికల విజయానికి ముందస్తు ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సమావేశానికి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ షిండే, బిగాల గణేష్ గుప్తా, షకిల్, నల్లమడుగు సురేందర్, మాజీ ఎం.ఎల్.సి వి గంగాధర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ తదితరులు హాజరయ్యారు.



