- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాలో ఉన్న దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు ఉచితంగా మంజూరు చేయడానికి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న దివ్యంగుల పత్రాలను శనివారం జిల్లా కమిటీ చైర్మెన్ /అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో సహాయ ఉపకరణాల అప్లికేషన్స్ స్క్రూటినీ , ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్క్రీనింగ్ కమిటీ సభ్యులు. జిల్లా సంక్షేమ అధికారి కె నరసింహ రావు, డీఆర్డీవో నాగిరెడ్డి, డీఏం అండ్ ఎచ్ఓ మనోహర్, డిటిఓ సాయి క్రిష్ణ, సూపరిండెంట్ జిల్లా శశికళ, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -