Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీలకు అదనపు పని భారం తగ్గించాలి: సీఐటీయూ

అంగన్వాడీలకు అదనపు పని భారం తగ్గించాలి: సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
అంగన్వాడీలకు అదనపు పనులు రద్దు చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, పనికి అదనపు వేతనం చెల్లించాలని టీ ప్రైమరీ పీఎం శ్రీ విద్యను అంగన్వాడి కేంద్రాల్లో నిర్వహించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు మల్లేష్ లు అన్నారు. సోమవారం రోజున  సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించి, వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ తో పాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విద్యా విధానం చట్టం తెచ్చింది ఇంతటి ప్రమాదకరమైన విధానాలకు వ్యతిరేకంగా నిలబడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి  భిన్నంగా ఐసిడిఎస్ ను మొత్తం నిర్వీర్యం చేసే పద్ధతిలో ఎన్ఈపిని అమలు చేయాలని నిర్ణయం చేయడం అత్యంత దుర్మార్గం అని అన్నారు.

పీ ప్రైమరీ పిఎంసి ఇంగ్లీష్ మీడియం విద్య పేరుతో ఐదు సంవత్సరాలలో పిల్లలను విద్యాశాఖకు అప్పగించడం అన్యాయం. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని, ప్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాల్లోని నిర్వహించాలని విద్యాబోధన బాధ్యతలు అంగన్వాడి టీచర్లకు ఇవ్వాలని  కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగన్వాడీల సమస్యలను గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇంగ్లీష్ మీడియం విద్య కు వ్యతిరేకంగా శ్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్యాపైన రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం సరికాదు.  ఇది ప్రభుత్వ విద్యకు బాలోపితం చేయకపోగా ప్రభుత్వంలో భాగమైన అతి ముఖ్యమైన పిల్లల మానసిక శారీరక విలువల కు కీలక పాత్ర పోషిస్తున్న ఐసీడీసీలు ఐసిడిఎస్ వ్యవస్థను విభజన చేసే విధంగా ఉన్నదనారు.

విద్య ఒక్కటే కాదు విద్య కంటే కూడా పౌష్టికాహారం అత్యంత ముఖ్యమైనదనీ , 70% శారీరత 93 మానసిక అభివృద్ధి ఈ వయసులోనే జరుగుతుందనీ , వయసును బట్టి కావలసిన క్యాలరీ శక్తి గల పౌష్టికాహారం అందించే లక్ష్యం కోసం  ఏళ్ల సంవత్సరాల క్రితం ఐ సి డి ఎస్ పుట్టింది ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకుండా   నిర్వీర్యం చేయడం కోసం గతంలో కూడా అనేక ప్రయత్నాలు చేశారనీ ,మదర్స్ కమిటీలు గ్రామ కమిటీలు గ్రామపంచాయతీలకు అప్పగించాలని చూశారని, నగదు బదిలీ ప్యాకెట్ ఫుడ్స్ సీసీ కెమెరాలు బయోమెట్రిక్ లాంటి అనేక రకాలైన విధానాలు తీసుకొచ్చి అంగన్వాడి వ్యవస్థలో పనిచేస్తున్న అంగన్వాడి టీచర్లకు ఆయాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారని ఆరోపించారు. 

  వెంటనే అంగన్వాడీల సమస్యల పరిష్కరించాలని ఫ్రీ ప్రైమరీ పిఎంసి విద్యను అంగన్వాడి కేంద్రాలకు నిర్వహించాలని కేంద్రాలు  విద్యాబోధన బాధ్యతను అంగన్వాడి టీచర్కు హెల్పర్స్ ఇవ్వాల నీ విద్యా వాలంటీర్లకు నిర్ణయించిన వేతనాన్ని అదనంగా అంగన్వాడి టీచర్లకు చెల్లించాలని ఆరు సంవత్సరాల లో పు పిల్లలకు ప్రైవేట్ స్కూల్స్ నడపడానికి అనుమతి  ఇవ్వకూడదని   ఐసిడిఎస్ కు సంబంధంలేని బిఎల్ఓ తగితాలు పనులకు రద్దు చేయాలని ఖాళీ పోస్ట్ చేయాలని అధికారుల వేధింపులు ఆపాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిల్వర్ రమా కుమారి  కార్యక్రమంలోఅంగన్వాడి టీచర్లు ఆయాలు  పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad