Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంరాష్ట్రానికి యూరియా కొరత తీర్చండి

రాష్ట్రానికి యూరియా కొరత తీర్చండి

- Advertisement -

– కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, నడ్డాకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రానికి యూరియా కొరత తీర్చాలంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. ఈమేరకు బుధవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, జేపీ నడ్డాను ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. ఆగస్టు మాసంలో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుందని గుర్తు చేశారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి తగినంత యూరియా సరఫరా చేయా లని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి కేటాయించిన యూరియాను వెంటనే ఇవ్వాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నెలకు రాష్ట్రానికి 1.70 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియాను కేటాయించిందని గుర్తు చేశారు. ఏప్రిల్‌ నుంచి జూలై మధ్య ఏర్పడిన 2.10 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరి యా కొరతను కూడా ఆగస్టు నెలలో మంజూరు చేయాలని పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img