Saturday, May 10, 2025
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం..

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025- 26 విద్యాసంవత్సరానికి దోస్తు ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపాల్ కె.అశోక్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. తమ కళాశాలలో అనుభవజ్ఞులైన బోధన సిబ్బంది, అత్యున్నత ప్రమాణాలతో విద్యార్థి సర్వతో ముఖాభివృద్దే తమ ధ్యేయమని, ప్రిన్సిపాల్ తెలిపారు. తమ కళాశాలలో బిఎ, బిఎస్సి లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, బీకాం, కంప్యూటర్ అప్లికేషన్ ఇంగ్లీష్ మీడియం కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, తమ కళాశాల దోస్త్ కోడ్ 5086 అని, అప్లై చేసేటప్పుడు తమ కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మరిన్ని వివరాలకై దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్. జి. వెంకటేశం (9492795524)ను సంప్రదించగలరని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -