Thursday, November 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఏఈఓ

ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఏఈఓ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రైతు కుటుంబం నుంచి రూ. 10,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండల వ్యవసాయ విస్తరణాధికారి జీ. సందీప్ పట్టుబడ్డాడు. జిల్లాకు చెందిన ఒక రైతు కుటుంబం ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. తన రైతు బీమా పరిహార దస్తావేజును ప్రాసెస్ చేసి, దానిని ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపించడానికి రూ. 10,000 లంచం అడిగాడని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుదారుని నుంచి రూ. 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -