– విజేతలు వీరే
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 3 వ తేది నుండి 6 వ తేది వరకు స్థానిక వ్యవసాయ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన అంతర్ కళాశాలల విద్యార్ధుల క్రీడా పోటీలు మంగళవారం తో విజయవంతంగా ముగిసాయి. 13 కళాశాల నుండి 400 పైగా హాజరైన విద్యార్ధులు వాలీబాల్,బాస్కెట్ బాల్,షటిల్ బ్యాడ్ మింట్,టేబుల్ టెన్నిస్,చదరంగం,క్యారమ్స్,ఫుట్ బాల్,ఖో ఖో,టగ్ ఆఫ్ వార్,క్రికెట్ క్రీడలు ఆడారు.
బాలురు విభాగంలో…
వాలీ బాల్ లో రాజేంద్రనగర్ పై జగిత్యాల విజయం సాధించింది.
బాస్కెట్ బాల్ లో రాజేంద్ర నగర్ పై పాలెం గెలుపొందింది.
షటిల్ బ్యాడ్మింటన్ లో అశ్వారావుపేట పై రాజేంద్ర నగర్ విజయం సాధించింది.
టేబుల్ టెన్నిస్ లో అశ్వారావుపేట పై రాజేంద్రనగర్ గెలుపొందింది.
చదరంగంలో రాజేంద్ర నగర్ పై వరంగల్ విజయం సాధించింది.
క్యారమ్స్ లో వరంగల్ పై రాజేంద్రనగర్ విజయం సాధించింది.
క్రికెట్ లో జగిత్యాల పై రాజేంద్రనగర్ గెలుపొందింది.
ఫుట్ బాల్ లో అశ్వారావుపేట పై రాజేంద్రనగర్ గెలుపొందింది.
ఖో ఖో పాలెం పై సిరిసిల్లా విజయం సాధించింది.
టగ్ ఆఫ్ వార్ లో సంగారెడ్డి పై సిరిసిల్ల విజయం సాధించింది.
పెరుగు పందెం లో…
100 మీటర్ ల పరుగుపందెంలో అశ్వారావుపేట,సంగారెడ్డి,అశ్వారావుపేట,జగిత్యాల విద్యార్ధులు ప్రధమ,ద్వితీయ,తృతీయ,చతుర్ధి స్థానాల్లో నిలిచారు.
200 మీటర్ల పరుగు పందెంలో అశ్వారావుపేట,సంగారెడ్డి,అశ్వారావుపేట విద్యార్ధులు ప్రధమ,ద్వితీయ,తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు.
400 మీటర్ల పరుగు పందెంలో అశ్వారావుపేట,అశ్వారావుపేట,పాలెం విద్యార్ధులు ప్రధమ,ద్వితీయ,తృతీయ స్థానాల్లో నిలిచారు.
800 మీటర్ల పరుగు పందెంలో రాజేంద్రనగర్,పాలెం,సంగారెడ్డి విద్యార్ధులు ప్రధమ,ద్వితీయ,తృతీయ స్థానాల్లో ఉన్నారు.
1500 మీటర్లు ను పెరుగు పందెంలో సంగారెడ్డి,పాలెం,వరంగల్ విద్యార్ధులు వరసగా మూడు స్థానాల్లో నిలిచారు.
3000 మీటర్ల పరుగుపందెంలో రాజేంద్రనగర్,అశ్వారావుపేట,సంగారెడ్డి విద్యార్ధులు వరసగా మూడు స్థానాల్లో విజేతలుగా నిలిచారు.
4 × 100 రిలే లో అశ్వారావుపేట,సంగారెడ్డి,రాజేంద్రనగర్,జగిత్యాల విద్యార్ధులు వరసగా నాలుగు స్థానాల్లో నిలిచారు.
4 × 400 రిలే లో అశ్వారావుపేట,సిరిసిల్ల,వరంగల్ విద్యార్ధులు వరస స్థానాల్లో నిలిచారు.
లాంగ్ జంప్ లో వరంగల్,సిరిసిల్ల,అశ్వారావుపేట వరస స్థానాల్లో నిలిచారు.
ట్రిపుల్ జంప్ లో సిరిసిల్ల,సిరిసిల్ల,సంగారెడ్డి విద్యార్ధులు వరస స్థానాల్లో నిలిచారు.
హై జంప్ లో పాలెం,సంగారెడ్డి,రుద్రూరు విద్యార్ధులు వరస స్థానాల్లో నిలిచారు.
డిస్క్ త్రో లో పాలెం,జగిత్యాల,వరంగల్ విద్యార్థులు వరుస స్థానాల్లో నిలిచారు.
జావెలిన్ త్రో లో రాజేంద్రనగర్,సిరిసిల్ల,జగిత్యాల విద్యార్ధులు వరుస స్థానాల్లో నిలిచారు
బాలికల విభాగంలో…
టేబుల్ టెన్నిస్ లో రాజేంద్రనగర్ పై అశ్వారావుపేట విజయం సాధించింది.
వాలీబాల్ లో రాజేంద్రనగర్ పై సంగారెడ్డి విజేతగా నిలిచింది.
క్యారమ్స్ లో సైఫాబాద్ పై రాజేంద్రనగర్ గెలుపొందింది.
టెన్నికాయిట్ లో సైఫాబాద్ పై అశ్వారావుపేట విజయం సాధించింది.
షటిల్ బ్యాడ్మింటన్ లో రాజేంద్రనగర్ పై సిరిసిల్ల విజయం సాధించింది.
చదరంగంలో వరంగల్ పై జగిత్యాల విజయం సాధించింది.
బాస్కెట్ బాల్ లో వరంగల్ పై అశ్వారావుపేట గెలుపొందింది.
ఖో ఖో లో జాయింట్ విన్నర్ గా అశ్వారావుపేట – సిరిసిల్ల నిలిచాయి.
టగ్ ఆఫ్ వార్ లో ఆదిలాబాద్ పై వరంగల్ విజయం సాధించింది.
100 మీటర్ల పరుగుపందెంలో రాజేంద్రనగర్,జగిత్యాల అశ్వారావుపేట వరుస స్థానాల్లో నిలిచాయి.
200 మీటర్ల పరుగుపందెంలో రాజేంద్రనగర్,అశ్వారావుపేట,సైఫాబాద్ వరుస స్థానాల్లో నిలిచాయి.
400 మీటర్ల పరుగుపందెంలో అశ్వారావుపేట,సంగారెడ్డి,పాలెం వరుస స్థానాల్లో నిలిచాయి.
4 × 100 మీటర్ల రిలే లో అశ్వారావుపేట,రాజేంద్రనగర్,సిరిసిల్ల లు వరుస స్థానంలో నిలిచాయి.
లాంగ్ జంప్ లో అశ్వారావుపేట,సిరిసిల్ల,సైఫాబాద్ లు వరుస స్థానాల్లో నిలిచాయి.
క్రికెట్ లో సిరిసిల్ల పై సంగారెడ్డి విద్యార్ధులు విజయం సొధించారు.




