- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని పెర్కీట్ లో సోయచిక్కుడు పంటలను గురువారం వ్యవసాయ అధికారులు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ సోయచిక్కుడులో వేరుకుళ్లు సోకడం గమనించినట్లయితే నివారణకు వర్షాలు తగ్గిన తర్వాత 3గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్ళు తడిచే విధంగా పోయాలి. పొగాకు లద్దె పురుగు ఆశించడం గమనించినట్లయితే నివారణకు 1మీ.లీ నోవాల్యురాన్ లేదా 0.3 మి.లీ క్లోరాంట్రనిలీప్రోల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఏ ఈ వో లు రోచన, అలేఖ్య , రైతులు పాల్గొన్నారు.
- Advertisement -