Tuesday, November 25, 2025
E-PAPER
Homeఖమ్మంఊటీ బంగాళదుంప పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన వ్యవసాయ విద్యార్ధులు

ఊటీ బంగాళదుంప పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన వ్యవసాయ విద్యార్ధులు

- Advertisement -

– బంగాళాదుంప పరిశోధనా స్థానం సందర్శించిన వ్యవసాయ విద్యార్ధులు
నవతెలంగాణ – అశ్వారావుపేట

తమిళనాడు ఊటీలోని సీపీ ఆర్ఎస్ (సెంట్రల్ పొటాటో రీసెర్చ్ స్టేషన్ – కేంద్రీయ బంగాళాదుంప పరిశోధనా స్థానం) ను మంగళవారం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్ధులు సందర్శించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల కు చెందిన 2023 బ్యాచ్ ,మూడో సంవత్సరం విద్యార్ధులు ఈ నెల 23 వ తేదీ నుండి డిసెంబర్ 2 వ తేదీ వరకు  చేపట్టిన దక్షిణ భారత విజ్ఞాన యాత్ర లో బాగంగా వీరు తమిళనాడు,కర్నాటక,కేరళ లో పలు వ్యవసాయ అనుబంధ పరిశోధనా కేంద్రాలను సందర్శించనున్నారు.

ఈ యాత్రకు టూర్ లీడర్లు గా కళాశాల ప్రొఫెసర్స్ డాక్టర్ కే.శిరీష,డాక్టర్ టి.శ్రావణ కుమార్, డాక్టర్ ఎ.శ్రీ జన్, కే.స్రవంతి వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా 3 వ రోజు ఐసీఏఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ – భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి) ఆద్వర్యంలో ఊటీ లో 1957 వ సంవత్సరంలో నెలకొల్పిన సీపీ ఆర్ఎస్( సెంట్రల్ పొటాటో రీసెర్చ్ స్టేషన్ అనేది  యొక్క ఒక పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు.

ఇది దక్షిణ భారతదేశంలోని ఉష్ణమండల కొండ ప్రాంతాలలో బంగాళాదుంపల సాగుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాలును అభివృద్ధి ఇందులో పరిశోధనలు జరుగుతుంటాయి.ఇది లేట్ బ్లైట్, సిస్ట్ నెమాటోడ్ వంటి వ్యాధులను నిరోధించే కొత్త బంగాళాదుంప రకాలను అభివృద్ధి చేస్తారు.ఈ కేంద్రం దక్షిణ భారతదేశంలోని రైతులకు సేవలందిస్తోంది. ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారాలను అందిస్తుంది.

దక్షిణ భారతదేశంలో బంగాళాదుంప సాగుకు సంబంధించిన వ్యవసాయ సాంకేతికతను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఈ కేంద్రం కార్యకలాపాలు ఉంటాయి. లేట్ బ్లైట్,సిస్ట్ నెమాటోడ్ వంటి వ్యాధుల నివారణకు నిరోధకత కలిగిన రకాలను అభివృద్ధి చేయడం,అలాగే ఇతర నేల,దుంప సంబంధిత వ్యాధులకు నియంత్రణ చర్యలను రూపొందించడం ఈ కేంద్రం ప్రాధాన్యాలు గా ఉన్నాయి. ఈ కేంద్రంలో కుఫ్రి సహ్యాద్రి, “కుఫ్రి స్వర్ణ” వంటి రెండు నూతన బహుళ నిరోధక బంగాళాదుంప రకాలను అభివృద్ధి చేసారు. ఈ కేంద్రం దక్షిణ భారతదేశంలోని బంగాళాదుంప పరిశోధన మరియు రైతులకు సహాయం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -