Wednesday, July 16, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిట్రంప్‌ విధానం ప్రమాదంలో వ్యవసాయం

ట్రంప్‌ విధానం ప్రమాదంలో వ్యవసాయం

- Advertisement -

అమెరికాతో భారత్‌ కుదుర్చుకోవలసిన వాణిజ్య ఒప్పందంలో ట్రంప్‌ విధించిన గడువు జూలై తొమ్మిదితో ముగిసింది. ఈ విషయంలో ఉభయ దేశాల మధ్య చర్చలు జరుగుతుండగానే ట్రంప్‌ ఏకపక్షంగా భారత్‌లో వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు. దీనిపై ప్రధాని మోడీ స్పందించలేదు. ఈ ఒప్పందం ప్రకారమైతే అమెరికా కోసం భారత్‌ మార్కెట్‌ను తెరవాలి. తన వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలి. మన మార్కెట్‌లోకి అమెరికా ఉత్పత్తులైన డెయిరీ, పౌల్ట్రీ, మొక్కజొన్న, సోయాబీన్‌, బియ్యం, గోధుమలు, ఇథనాల్‌, సిట్రస్‌ పండ్లు, బాదం, యాపిల్‌,ద్రాక్ష, క్యానడ్‌ పీచస్‌,చాక్‌లెట్స్‌ ఇవి దిగుమతి అయితే దేశ వ్యవ సాయ రంగానికి తీవ్రనష్టం. ఎందు కంటే, భారత జనాభా 146కోట్ల మందికి సరిపడా ఆహార ధాన్యాలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని అమెరికా నుండి దిగుమతి చేసుకుంటే వ్యవసాయ రంగంపై ఆధారపడిన సన్న,చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారు. అమెరికాలో సబ్సిడీలెక్కువ. అందులో వ్యవసాయంపై ఆధారపడిన వారు కేవలం ఐదు శాతం మాత్రమే. అక్కడ యావరేజ్‌ కమతం 187 హెక్టార్లు. భారతదేశంలో ఒక హెక్టార్‌లోపు మాత్రమే వస్తుంది. కాబట్టి అమెరికాలో దిగుబడి బాగా ఉంటుంది. భారత మార్కెట్‌ లో వ్యవసాయం, పాల ఉత్పత్తుల రంగంలో తమ ఉత్పత్తులను తెరవాలనేది అమెరికా డిమాండ్‌.ఈ ఉత్పత్తుల దిగుమతులపై విధిస్తున్న సుంకాలను తగ్గించమని భారత్‌పై ఒత్తిడి తెస్తోంది.అమెరికా ప్రధానంగా గోధుమ,బియ్యం,పాల ఉత్పత్తులు,సోయా,పిస్తా,బాదం వంటి ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరుతోంది. అమెరికన్‌ కంపెనీలు అమెజాన్‌,వాల్‌మార్ట్‌ వంటి సంస్థలు నేరుగా భారత మార్కెట్‌లోకి ప్రవేశించి తమ ఉత్పత్తులను సులభంగా విక్రయించేందుకు ఇది సహాయపడుతుంది.అయితే ఈ ఉత్పత్తులు చౌకధరలకు అందిస్తే భారతదేశ రైతులు తీవ్రనష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆహార భద్రత కింద వ్యవసాయ ఉత్పత్తుల ధరలను కూడా కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో ఉంచుతుంది. దీంతో మన రైతులకు గిట్టుబాటు ధరలు కూడా రావడం లేదు.జన్యుపరమైన మార్పులతో అమెరికా పండించిన ఆహార పంటలను ఉత్పత్తి చేస్తుంది.ప్రధానంగా మొక్కజొన్న, సోయాబీన్స్‌ వంటివి వీటితో పాటు పశువులకు అవసరమైన దానా సప్లరు చేయడానికి ఒప్పం దం చేసుకోవాలని చూస్తుంది. గతంలో మనదేశం డెయిరీ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఇప్పుడు దాన్ని ఎత్తివేయాలని అమెరికా కోరుతున్నది. ఇండియా సాధారణంగా 17శాతం టారిఫ్‌ వేస్తున్నది.దీన్ని ఇప్పుడు టారిఫ్‌ కిందకు తీసుకురావాలని చెప్ప కుండా 3.3శాతం టారిఫ్‌ అమలు చేయాలంటోంది.అమెరికా మన ఎగుమతులపై 26శాతం టారిఫ్‌లు పెంచింది. తమ వాణిజ్యలోటును తగ్గించుకునేందుకు వ్యవసాయ ఉత్పత్తులను భారత్‌కు ఎగుమతి చేయాలనుకుంటోంది.దీంతో అమెరికా లోని రైతులకు లాభం చేకూరుతుంది. అమెరికా ఉత్పత్తులు మన దేశంలోకి వస్తే మన పంటలకు ధరలు లేక రైతుల ఆదాయాలు పడిపోతాయి. పైగా రైతులు అనివార్యంగా వ్యవసాయ రంగం నుంచి తప్పుకుని ఆహార పంటలను తగ్గించాల్సి వస్తుంది. అమెరికాలో మొక్క జొన్న, సోయాబీన్‌, గోధుమ, బియ్యం వంటి పంటలపై నూతన వ్యవసాయ బిల్లులతో 61డాలర్ల నుండి 175డాలర్లకు సబ్సిడీ పెంచారు.అంటే 150శాతం.పంట బీమా సబ్సీడీ,అగ్రికల్చర్‌ రిస్క్‌ కవరేజీ కూడా కనీస దిగుబడి కంటే తక్కువ వస్తే మాత్రమే అంత మొత్తం సబ్సీడీ ఇస్తారు.ధర కోల్పో యిన కవరేజ్‌ కూడా జాతీయ సగటు ధర కంటే మార్కెట్‌లో తక్కువ ధరకు సరుకు అమ్మితే ఆ మొత్తం సబ్సీడీ ఇస్తారు.పంట ఉత్పత్తి, పర్యావరణహిత పంటలకు మాత్రమే సబ్సిడీ ఇస్తారు.అమెరికాలో చిన్న రైతులకు కేవలం 39శాతం సబ్సీడీలిస్తే పెద్ద రైతులకు 69శాతం సబ్సిడీ ఇస్తున్నారు.ఈ సంఖ్య చాలా పెద్దగా ఉంటుంది.


అమెరికాలో చిన్నరైతు అంటే 500 ఎకరాలలోపు ఉన్నవారే.అమెరికా బడ్జెట్‌లో 6.8ట్రిలియన్‌ డాలర్లు కేటాయించినది.ఒక ట్రిలియన్‌ అంటే రూ.వెయ్యి కోట్లు.అంటే 6లక్షల 80వేల కోట్ల డాలర్లు.అయితే భారతదేశం వ్యవసాయ రంగానికి కేవలం 2.5శాతం మాత్రమే సబ్సీడీ ఇస్తున్నది.ఈ రకంగా భారతీయ వస్తువులపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించిన పక్షంలో వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, ఫార్మా,వైద్య పరికరాలు,విద్యుత్తు పరికరాలు,యంత్రాలతోసహా అనేక రంగాలకు చెందిన వస్తువులపై ప్రతి కూల ప్రభావం పడుతుంది. అమెరికా,భారత్‌ విధించే దిగుమతి సుంకాల రేట్ల మధ్య చాలా తేడా ఉన్న కారణంగా ట్రంప్‌ ప్రభుత్వం నుంచి అదనపు కస్టమ్స్‌ సుంకాలను ఈ రంగాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అమెరికా,భారత్‌ మధ్య రసాయనాలు,ఫార్మసీ వస్తువుల దిగు మతి సుంకంలో 8.6 శాతం తేడా ఉంది.ట్రంప్‌ విధించే ప్రతీకార సుంకాల కారణంగా అమెరికాకు దిగుమ తయ్యే భారతీయ వస్తు వులపై నికరంగా 310 కోట్ల డాలర్ల అంటే సుమారు 26,483 కోట్ల రూపాయలు నష్టం ఏర్పడగలదు. ఇది భారత జీడీపీపై 0.1 శాతం ప్రభావం చూపగలదు. అందుకే ట్రంప్‌ టారిఫ్‌లను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించాలి.
– మాదినేని రమేష్‌, 9490098298

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -