Saturday, May 24, 2025
Homeతెలంగాణ రౌండప్పెళ్లికి హాజరైన ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్

పెళ్లికి హాజరైన ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్: మహారాష్ట్ర దేగ్లూర్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ సిరిసెట్టివార్ మొగులాజి కుమార్తె పెళ్లి దేగ్లూర్ పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభో గంగ నిర్వహించిన పెళ్లి శుభ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ హాజరై వధూవరులకు అక్షంతలు వేసి ఆశీర్వదించారు. ఈ పెళ్లికి దేగ్లూర్ అమ్మాయి మద్నూర్ అబ్బాయి దేగ్లూర్ పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ సిరి శెట్టి వారు మొగలాజి మహారాష్ట్రలోనే కాకుండా తెలంగాణ సరిహద్దు జుక్కల్ బాన్సువాడ నియోజకవర్గాల రాజకీయ నాయకులతో పాటు బంధుమిత్రులందరికీ మంచి పరిచయమున్న వ్యక్తి. దీనితో అతని కుమార్తె పెళ్లి ఇరు రాష్ట్రాల ప్రజలకు చూడదగిన విధంగా నిర్వహించారు. ఈ పెళ్లి కి నాందేడ్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని జుక్కల్ బాన్సువాడ నియోజకవర్గం చెందిన వివిధ పార్టీల ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ పెళ్లికి వేలాదిగా జనాలు హాజరు కావడం ఇరు రాష్ట్రాల బంధుమిత్రులంతా ఇంత పెద్దగా పెళ్లి చూడడం ఇదే మొదటిసారి అని పేర్కొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -