- Advertisement -
– రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు సంఘ శ్రీధర్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
భూమికోసం భుక్తి కోసం పోరాడిన ఐలమ్మను బడుగు బలహీన వర్గాలు స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు నడవాలని రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు సంఘ శ్రీధర్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ మండలంలోని మహమ్మదాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణంలో ఐలమ్మ 130వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఐల్లమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మడేలేశ్వర రజక సంఘం గౌరవ అధ్యక్షులు సంఘ రాజయ్య, గ్రామ అధ్యక్షులు సంగా రాజు ,వెంకటేష్ ,రమేష్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -