నవతెలంగాణ- మద్నూర్
మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత ఐలమ్మ అని మద్నూర్ మండల రజక సంఘం అధ్యక్షులు ఇందూరు దేవిదాస్ అన్నారు. ఐలమ్మ 130వ జయంతి వేడుకలు మద్నూర్ మండల కేంద్రంలోని రజకుల గల్లీలో రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ జయంతి వేడుకలు రజకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో రజక సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ.. మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పిన వీరవనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ఆమె అడుగుజాడల్లో ముందుకెళ్లాలని తెలిపారు. ఈ జయంతి వేడుకల్లో రజకులు సంగ్రామ్, మోహన్, కృష్ణ ,రాములు, సాయిలు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.
మహిళా లోకానికి ధీర వనిత వీరనారి ఐలమ్మ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES