Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం

ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం

- Advertisement -

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులు కమ్యూనిస్టులే
పోరాట వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌ మెట్‌
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని, ఆ వీరోచిత పోరాటంలో చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తి చరిత్రలో చిరస్మరణీయమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ చెప్పారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ ఇందిరా గార్డెన్‌లో బుధవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించిన అనంతరం జాన్‌వెస్లీ మాట్లాడారు. నిజాం నియంతృత్వ, నిరంకుశ, భూస్వామ్య శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా నాడు రైతులు వీరోచితంగా పోరాడారన్నారు. సాయుధ రైతాంగ పోరాటం ఫలితంగా భూమి లేని పేదలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టారని తెలిపారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటంలో కమ్యూనిస్టులు అగ్రభాగాన నిలిచారన్నారు. నైజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి తమ ఆస్తిత్వ స్వేచ్చను సాధించుకున్న దాంట్లో ఐలమ్మ పాత్ర ప్రముఖంగా నిలిచిందన్నారు. దొరల కింద బానిసలుగా ఉన్నవారే బంధూకులై పోరాడారన్నారు. పల్లె, పల్లెన సంఘం పెట్టి 3 వేల గ్రామాలను నియంతృత్వ దోపిడీ నుంచి విముక్తి కలిగించారన్నారు. ఆమె పోరాట స్ఫూర్తితో నేడు ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు ఘనంగా నిర్వహించుకుందామని, ఇందులో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతాంగ సాయుధ పోరాటంతో సంబంధం లేని బీజేపీ.. దాన్ని హిందూ ముస్లిం పోరాటంగా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. అసలు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సాయుధ పోరాటంలో పాల్గొనలేదని, వారి ఆనవాళ్లు కూడా లేవని, కేవలం వారి రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ.. పది లక్షల ఎకరాల భూమిని పంచింది కమ్యూనిస్టులేనని అన్నారు. అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. గిట్టుబాటు ధరల కోసం పోరాటం చేస్తుంది ఎర్రజెండానే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కార్యదర్శివర్గ సభ్యులు ఏర్పుల నర్సింహ్మ, మండల కార్యదర్శి నర్సింహ్మ, సభ్యులు గుండె శివకుమార్‌, ముత్యాలు, బాలరాజు, శ్రీశైలం, బిక్షపతి, ఊషయ్య, జంగయ్య, కార్యకర్తలు, కార్మికులు, అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad