Monday, December 29, 2025
E-PAPER
Homeదర్వాజగాలి పోరాటం

గాలి పోరాటం

- Advertisement -

గాలికి గాలాడ్డం లేదని
ఒక సుడిగాలి కబురొచ్చింది-
ఏదో ఊపిరాడనట్టు దగ్గొచ్చి
స్కూల్లో ఉన్న మనవరాలు గుర్తుకొచ్చింది-
అమ్మాయికి చెప్పాలి
అన్నం బాక్స్‌ తో పాటు
ఆక్సిజన్‌ బాక్స్‌ కూడా పెట్టమని-
ఒక మాస్క్‌ కొని పెట్టమని
రాజధాని నగరం
పార్లమెంటు ముందు మోకరిల్లిందని
వార్త మోసుకొచ్చిన పత్రిక
మా గుమ్మం దగ్గర పాములా కదులుతూ కనపడింది-
పార్లమెంటుని తమ సేఫ్టీ కోసం
స్పేస్‌లో కట్టుకోడానికి
ఇంజనీర్లతో సైంటిస్టులతో
సమావేశంలో పాలకులు
బిజీగా ఉన్నారట-
వారి బ్యాంకు ఎకౌంట్లలో
గుడ్లు పొదుపుతూ కార్పొరేట్‌ కొండచిలువలు
కునుకుతీస్తున్న దశ్యం
సోషల్‌ మీడియాలో
వైరల్‌ అయినట్టు మరో వార్త-
ఐదేళ్లకోసారి సార్వత్రిక శవ పరీక్షలు
సజీవనిర్జీవ దేహాల జాతర
పర్యావరణం పాడె మీద
ప్రజాస్వామ్యం ఊరేగింపు
పసుపు పూసిన కొరడాలతో
మహా నాయకుల ప్రదర్శన
అధినాయకుని నాన్‌ బయొలాజికల్‌ అహంకారానికి
సాష్టాంగ ప్రమాణం చేస్తున్న
శల్యావశిష్ట స్వాతంత్య్రం
నగరాల నుండి మనుషులా
మనుషుల నుండి నగరాలా
ఎవరు ముందు పారిపోవాలో
తెలియక ఒక సంధిగ్ధ సందర్భంలో
నలిగిపోతున్న కాలానికి మరో అకాల కానుపు-
దేశమంతా కాలుష్యం పురిటి కంపు
నాన్నలారా! మీరు మాత్రం
పిల్లల కోసం ఆస్తులు సరే
కాస్త ఆక్సిజన్‌ కూడా కూడబెట్టండి
ఇక మీ ఆరాటాలు పక్కనబెట్టి
గాలి పోరాటాలు మొదలు పెట్టండి!
మంచు ముసుగు.. వెన్నెల నవ్వు..
గుర్తు పట్టలేరు గాల్లో కాపు కాసిన మత్యువుని

  • ప్రసాదమూర్తి, 8499866699
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -