నవతెలంగాణ – ముధోల్
మండలంలోని చించాల గ్రామంలో గల హనుమాన్ మందిరంలో గత వారం రోజుల నుండి కొనసాగుతున్న అఖండ హరినామ సప్తహం ఆదివారం నాటికి ముగిసింది. ముగింపు సందర్భముగా శ్రీ నారాయణ మహారాజ్ యాతల్ కర్ కాళకీర్తన నిర్వహించారు. ప్రతి మానవుడు జీవిత గమనంలో ఆధ్యాత్మిక చింతన తోనే మానవజన్మ స్వార్థకమవుతుందని అన్నారు. భక్తి భావంతో జీవితం ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఉట్టి కొట్టేకార్యక్రమాన్ని నిర్వహించారు. ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్ఠల్ రెడ్డి,బీఆర్ ఎస్ నియోజకవర్గ నాయకురాలు రమాదేవి , బిజేపి నాయకులు నర్సగౌడ్ ,లు ముగింపు కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. అధిక సంఖ్యలో మహిళలు భక్తులు భజన మండలి సభ్యులు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహారాజులకు భజన మండలి సభ్యులకు,నాయకుల కు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సప్తహ ముగింపు సందర్భంగా జాతర కొనసాగింది జాతరకు వచ్చిన భక్తులకు గ్రామస్తులు భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్ లు సర్వేష్, సాయినాథ్ గౌడ్, విట్ఠల్ గురిజి, శంకర్ ,ధర్మన్న, వడ్ల లింగన్న, విఠల్, భీమెంధర్, శివాజీ,సత్యనారాయణ ,భైరోళ్ల లస్మన్న , కన్నోల్ల అంజయ్య,లచ్చరాం, భూమన్న,సాయిలు,చింటు, రవి,అంజయ్య, శ్రీకాంత్ ,తదితరులు పాల్గొన్నారు.



