Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికైన అక్షయ్‌

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికైన అక్షయ్‌

- Advertisement -

నవతెలంగాణ – కోహెడ
మండలంలోని వరికోలు గ్రామానికి చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థి గండికోట అక్షయ్‌కుమార్‌ రాష్ట్రాస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి మెదక్‌ జిల్లా స్థాయి 17 సంవత్సరాలలోపు బాలుర ఫుట్‌బాల్‌ పోటీలలో సంగారెడ్డిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రాస్థాయికి ఎంపికయ్యాడన్నారు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు లేకపోయినప్పటికి ఫుట్‌బాల్‌పై మక్కువతో ఆడినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రస్థాయికి ఎంపిక కావడంతో ఉపాధ్యాయులు రాంచంద్రారెడ్డి, సంగు రామకృష్ణ, ఉపేందర్‌, తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -