Tuesday, October 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వయోజనులందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి

వయోజనులందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి

- Advertisement -

తెలంగాణ సాంస్కృతిక సారథ కళాకారుల బృందం టీం లీడర్ ఆస రామారావు.
నవతెలంగాణ – రాయపోల్ 

వయోజనులందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందం టీమ్ లీడర్ ఆస రామారావు అన్నారు. మంగళవారం రాయపోల్ మండలం రామారం ఓటు హక్కు వినియోగం, పరిసరాల పరిశుభ్రత, ట్రాఫిక్ నియమాలు, డ్రగ్స్, సైబర్ నేరాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల పై పాట మాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ హైమావతి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బిజ్జూరి రవి కుమార్ ఆదేశాల మేరకు రాయపోల్ మండల కేంద్రంలో ఓటు హక్కు వినియోగం, పరిసరాల పరిశుభ్రత, డ్రగ్స్ నియంత్రణ, వర్షా కాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకునే జాగ్రత్తలు, ప్లాస్టిక్ నిషేధం, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని వీటితోపాటు ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాల పైన ఆట-పాటలతో ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించడమైనది. ఈ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందం చీకోడు నర్సింలు, బిట్ల ఎల్లం, తుమ్మల ఎల్లం, సందుర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -