Wednesday, April 1, 2026
E-PAPER
Homeకరీంనగర్పొద్దుతిరుగుడు సేకరణకు అన్ని ఏర్పాట్లు

పొద్దుతిరుగుడు సేకరణకు అన్ని ఏర్పాట్లు

- Advertisement -

కలెక్టర్ గరిమ అగ్రవాల్
మార్క్ ఫెడ్, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

పొద్దుతిరుగుడు సేకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని మార్క్ ఫెడ్ అధికారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. పొద్దుతిరుగుడు పంట కొనుగోలుపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మార్క్ ఫెడ్, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం కలెక్టర్ నిర్వహించారు.

కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలో పొద్దుతిరుగుడు పంట 1,700 ఎకరాల్లో సాగు చేశారని వెల్లడించారు. ఈ పంట కొనుగోలుకు మార్క్ ఫెడ్ ఆద్వర్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు. కొనుగోలు కోసం కావాల్సిన సామాగ్రి, వేయింగ్ యంత్రాలు అన్ని ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. క్వింటాల్ పొద్దుతిరుగుడుకు రూ.7721 మద్దతు ధర ఉందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. రైతులు దీర్ఘకాలం పాటు ఆదాయం వచ్చే ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. దీంతో అధిక దిగుబడి, ఆదాయం వస్తుందని తెలిపారు.

సన్న వడ్లు పండించేలా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మద్దతు ధర, బోనస్ ఇతర లాభాలను రైతులకు వివరించాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, మార్క్ ఫెడ్ డీఎం హబీబ్, సహకార శాఖ అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -