నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
జిల్లాలోని పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని మెప్మా ఆద్వర్యంలో ముష్టిపల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఇంచార్జి కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంత వరకు ఎంత ధాన్యం వచ్చింది? ఎంత కొనుగోలు చేశారో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా టెంట్, నీటి, విద్యుత్ సరఫరా వసతి కల్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా చెత్తాచెదారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సరైన తేమ శాతం 17 వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ఇంకా వరి కోతలు మొదలు పెట్టని రైతులు రెండు రోజుల పాటు వాయిదా వేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, సిరిసిల్ల తహసిల్దార్ మహేష్ కుమార్, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



