Wednesday, January 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇందిరమ్మ ప్రభుత్వంలో జర్నలిస్టుల సమస్యలన్నిటికీ పరిష్కారం

ఇందిరమ్మ ప్రభుత్వంలో జర్నలిస్టుల సమస్యలన్నిటికీ పరిష్కారం

- Advertisement -

– సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
– డెస్క్‌ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించిన మంత్రికి ధన్యవాదాలు తెలిపిన డీజేఎఫ్‌టీ, టీడబ్ల్యూజేఎఫ్‌, హెచ్‌యూజే
నవతెలంగాణ- హైదరాబాద్‌ బ్యూరో

గతంలో ఇచ్చిన హామీ మేరకు డెస్కు జర్నలిస్టులకు న్యాయం చేసిన సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి డిజెఎఫ్‌టి, టీడబ్ల్యూజేఎఫ్‌, హెచ్‌యూజే నాయకులు ధన్యవాదాలు తెలిపారు. సచివాలయంలో మంగళవారం మంత్రిని కలిసి శాలువాతో సత్కరించారు. వర్కింగ్‌ జర్నలిస్టులకు ప్రభుత్వ సహకారం కొనసాగాలని, ఇతర పెండింగ్‌ సమస్యలు కూడా పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని మంత్రిని కోరారు. మంత్రి పొంగులేటి స్పందిస్తూ.. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకూ ఆదరణ ఉంటుందని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.రాజశేఖర్‌, కార్యదర్శి ఇ.చంద్రశేఖర్‌, హెచ్‌యూజే నాయకులు, డీజేఎఫ్‌టీ నాయకులు మస్తాన్‌, ఉపేందర్‌, విజయ, రాజారాం, కృష్ణ, వినోదరావ్‌ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -