గ్రామీణ రోడ్ల పై నరకం చూస్తున్న వాహన దారులు
పట్టించుకోని పాలకులు
నవతెలంగాణ – పెద్దవూర
మండలంలోని నాయినవానికుంట పర్వేదుల రోడ్డు, గర్నెకుంటనుంచి పెద్దవూర, పెద్దగూడెం నుంచి కొత్తలూరు, బాసోని భావినుంచి ఉట్లపల్లి, తుమ్మచెట్టునుంచి పులిచర్ల, పోతునూరు నుంచి పులిచర్ల, బసిరెడ్డిపల్లి నుంచి శిరసనగండ్ల, గ్రామాలకు వెళ్లే దారులు ప్రమాదకరమైన రహదారులుగా మారాయి. అడుగున్న లోతున గుంతలు పడి ప్రయాణానికి ఇబ్బందిగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలు లోతుగా ఏర్పడం ఒక కారణ మైతే, పైపు లైన్లకోసం తీసిన గుంతలు పూడ్చక పోవడం రెండో కారణం. అంతే గాక రోడ్డు మీద ట్రాక్టర్ల తో తోలుతున్న కంకర కింద పడిపోయి అవి టైర్ల కింద పడి ఎగిరి ద్వి చక్రవాహనాలను నడిపే వారి పై ఎగిరి పడి గాయాలు అవుతున్నాయి. ఇదీ మూడో కారణం.
12 ఫీట్ల రోడ్ల పైటిప్పర్లు, కంకర ట్రాక్టర్లు ద్వారా అధిక లోడుతో మట్టి తోలడగంతో రోడ్లపై గుంతలు పడ్డాయి. ప్రధానంగా నాయిన వాణికుంట, పర్వేదుల రోడ్డు, గర్నెకుంట పెద్ద వూర రోడ్డు, పులిచర్ల నుంచి పోతునూరు రోడ్డురహదారులు ఫీట్ లోతు గుంతలు ఏర్పడి వాటిని పూడ్చిక దెబ్బతిన్నాయి. దీనికి తోడు ఇటీవల కురిసిన వర్షాలకు మరింత ప్రమాదకరంగా మారాయి. కుంగిపోయి ప్రమాదాలకు నిలయంగా మారాయి.రోడ్ల మరమ్మతులు చేయక 18 ఏండ్లు గడుస్తున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీదుకోవడం లేదు. పాఠశాలలకు వెళ్లే హాలియా, పెద్దవూర మండలాలకు చెందిన స్కూల్ బస్సులు 10 నడుస్తున్నాయి. విద్యార్థులు ప్రయాణించాలంటే నరకం చూస్తున్నారు. అనేకమార్లు ఈ రహదారుల గుంతల్లో వాహనాలు ఆగిపోయి తీవ్ర ఇబ్బంది పడిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, గుత్తేదారులు ఈ ప్రాంతాల రహదారులను యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టి రహదారులను బాగు చేయాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
రోడ్లన్నీ గుంతలు..పూడ్చేది ఎప్పుడు.?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES