అల్లరి నరేష్ నటించబోయే కొత్త సినిమా శనివారం ప్రారంభమైంది. హీరోగా ఆయన నటిస్తున్న 65 చిత్రమిది. తనకి బాగా గుర్తింపు తీసుకొచ్చిన కామెడీ జోనర్‌లోనే ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫాంటసీ, కామెడీ బ్లెండ్‌తో రిఫ్రెషింగ్‌గా ఉండబోతోంది. ‘కామెడీ గోస్ కాస్మిక్’ అని మేకర్స్ చెప్పడం క్యురియాసిటీని పెంచింది.
ఈ చిత్రం శనివారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా వేడుకతో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. హీరో నాగ చైతన్య ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు వి.ఐ.ఆనంద్ ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకులు వశిష్ట, రామ్ అబ్బరాజు, విజరు కనకమేడల స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. హర్ష్ శంకర్, సుప్రియ యార్లగడ్డ, అనిల్ సుంకర, జెమిని కిరణ్ ఈ వేడుకలో పాల్గొన్నారు.
మెయిన్ స్ట్రీమ్ కామెడీ, డిఫరెంట్ ఆఫ్‌బీట్ పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అల్లరి నరేష్ ఇందులో సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. వెన్నెల కిషోర్, నరేష్ వి.కె., శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో నటిసున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ చిత్రానికి డిఒపి: రాంరెడ్డి, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్.
అల్లరి నరేష్ నయా సినిమా షురూ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES