Wednesday, February 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫిర్యాదు చేయనీయలేదని ఆరోపణలు

ఫిర్యాదు చేయనీయలేదని ఆరోపణలు

- Advertisement -

 –  సీఐపై అకారణ దూషణ, బెదిరింపుల ఆరోపణ
నవతెలంగాణ –  కామారెడ్డి
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తమను కామారెడ్డి పట్టణ  సీఐ అకారణంగా దూషిస్తూ బెదిరించారని మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులైన గుమ్మల వారి రవి, ఎలకంటి రవీందర్ గౌడ్ బాధితులు ఆరోపించారు. దొంగ ఓట్లు వేస్తున్నారని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా, సీఐ అడ్డుకుని అవకాశం ఇవ్వలేదని వారు తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా తమ ఫిర్యాదును స్వీకరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, పోలీసుల ప్రవర్తన కారణంగా తమకు న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఎన్నికల నిబంధనల ప్రకారమే నడుచుకున్నాం ( కామారెడ్డి పట్టణ సీఐ ) ఈ విషయంపై పట్టణ సీఐని వివరణ కోరగా తాను ఎన్నికల నిబంధనల మేరకే విధులు నిర్వహించడం జరిగింది. పోలింగ్ బూత్ కు 100 మీటర్ల దూరంలో ఉండవలసిన వారు మూకుమ్మడిగా బూతు వద్దకు రావడంతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాను. కావాలని ఎవరిని కక్షపూరితంగా అడ్డుకోలేదు.  తొమ్మిదో వార్డులో ప్రధాన పార్టీల  మధ్య ఘర్షణ ఒకరికి గాయాలు  ఓటమి భయంతో బీజేపీ కార్యకర్తలపై దాడులకు తినలేపారని బిజెపి నాయకులు ఆరాపించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి పట్టణం 9 వ వార్డులో వి ఆర్ కె   జూనియర్ కళాశాల వద్ద దొంగ ఓటు వేయటానికి వచ్చిన వారిని అడ్డుకున్నందుకు బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు  12 మంది  ప్రత్యక్ష దాడి చేయటం జరిగిందన్నారు. ముగ్గురు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. బిజెపి నాయకులు దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించారని అడ్డుకోవడం వల్లనే ఈ ఘర్షణ చోటు చసుకుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -