- Advertisement -
నవతెలంగాణ- మోర్తాడ్
మండల కేంద్రంలోని టీఎస్సార్ బకెట్ హాల్లో సుంకేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని మంగళవారం నిర్వహించుకున్నారు. 2003-2004 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు సమ్మేళనని ఏర్పాటు చేసుకొని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ 20 సంవత్సరాలకు పైగా గడుస్తున్నప్పటికీ తమపై మమకారంతో ఈ సమావేశానికి పిలుస్తూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చయడం చాలా సంతోషంగా ఉందని ఉపాధ్యాయులు అన్నారు. పతి విద్యార్థి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానిస్తూ మెమొంటో అందజేశారు. ఈ కర్మములో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -