Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఉన్నత పాఠశాలకు బీరువాను బహుకరించిన పూర్వ విద్యార్థులు 

ఉన్నత పాఠశాలకు బీరువాను బహుకరించిన పూర్వ విద్యార్థులు 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
మండల కేంద్రంలో గల ఉన్నత పాఠశాలకు 2004-05 విద్యా సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు సోమవారం బీరువాను బహూకరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకొని పూర్వ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఉన్న ఊరును, కన్నతల్లిని, విద్యాభ్యాసం అందించే బడిని జీవితంలో మరువకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ముస్కు నిశాంత్, సముద్రాల ఆంజనేయులు,జీడి నరేందర్,రాపాక అనిల్, గాదేపాక కిరణ్,ఎండి నసీరుద్దీన్ ,నరేష్,  నాగేందర్, చారగొండ్ల రవి , స్వప్న, సరిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad