- Advertisement -
- ఆక్సియో స్వాధీనంతో ప్రవేశం
ముంబయి : ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ ఇండియా ప్రత్యక్ష రుణ జారీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న బ్యాంకింగేతర విత్త సంస్థ ఆక్సియోను స్వాధీనం చేసుకుంది. అయితే దీన్ని ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ ఒప్పందానికి జూన్‌లోనే ఆర్బీఐ ఆమోదం తెలిపిందని అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ మహేంద్ర నెరుర్కర్ తెలిపారు. ఫిన్‌టెక్ లెండర్ ఆక్సియో, రిటైల్ కస్టమర్లు, చిన్న వ్యాపారాలకు డిజిటల్ రుణాలు, మనీ మేనేజ్‌మెంట్ సొల్యూషన్లను అందిస్తుంది. ”తమ కస్టమర్లు, చిన్న, మధ్యస్థ వ్యాపారాల అవసరాలకు కొత్త రుణ ప్రొడక్టులను ఆవిష్కరిస్తాము.” అని మహేంద్ర తెలిపారు.
- Advertisement -