Friday, September 26, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాది దౌర్జన్యమే

అమెరికాది దౌర్జన్యమే

- Advertisement -

పడవలపై దాడి ఘటన పట్ల కొలంబియా అధ్యక్షుడు పెట్రో
బొగోటా : కరేబియన్‌ సముద్రంలో ప్రయాణిస్తున్న పడవలపై మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నాయన్న కారణంతో అమెరికా వైమానిక దాడులు జరపడం దౌర్జన్యమేనని కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో విమర్శించారు. అమెరికా దాడుల్లో కొలంబియన్లు చనిపోయారని విచారణలో తేలితే ఆ దేశ అధికారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ‘మీరు పడవలను ఆపి సిబ్బందిని అరెస్ట్‌ చేయొచ్చు. కానీ క్షిపణి దాడి ఎందుకు చేశారు?’ అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికాను పెట్రో నిలదీశారు. మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న పడవలను ఆపి, సిబ్బందిని అరెస్ట్‌ చేస్తే మరణాలేవీ సంభవించవని ఆయన చెప్పారు.

సముద్రంలో జరుగుతున్న కొకైన్‌ రవాణాను అడ్డుకునేందుకు అమెరికా సంస్థలు, ఇతర ఏజెన్సీలతో కలిసి చాలా కాలంగా చర్యలు తీసుకుంటున్నామని పెట్రో గుర్తు చేశారు. ఈ చర్యల కారణంగా గతంలో ఎవరూ చనిపోలేదని, ఎవరినీ చంపాల్సిన అవసరమూ లేదని ఆయన తెలిపారు. తుపాకీని ఉపయోగించడం మినహా వేరే ఏ విధమైన ఆయుధాలను ప్రయోగించినా అది చట్ట ఉల్లంఘన కిందికే వస్తుందని అన్నారు. ట్రంప్‌ తమ ప్రజలను అవమానిస్తున్నారని ఆరోపించారు. తన విదేశీ విధానాల ద్వారా ట్రంప్‌ అమెరికాను ఏకాకిని చేస్తున్నారని ఎత్తిపొడిచారు. ‘ట్రంప్‌ నన్ను ఇప్పటికే అవమానించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో నన్ను ఉగ్రవాదిగా సంబోధించారు’ అని పెట్రో మండిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -