Magazines

సీజేపీ నిరసనల పై భారత్‌ను ప్రశ్నించాలి

2 గంటల క్రితం

CJP protests.
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 2 నిమిషాల చదవడం

మార్కో రూబియోను కోరిన అమెరికా చట్టసభ సభ్యులు

భద్రతా బలగాల అణచివేత, అక్రమ నిర్బంధాలు, అధిక బలప్రయోగంపై ఆక్షేపణ


వాషింగ్టన్ :ఢిల్లీ నిరసనలపై ఆరుగురు అమెరికా డెమోక్రటిక్ చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనల సమయంలో భారత్‌లో భద్రతా బలగాల అణచివేత, అక్రమ నిర్బంధాలు, అధిక బలప్రయోగంపై యూఎస్ : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి మద్దతుగా ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టిన ఆందోళనకారులపై భారత్‌లో భద్రతా బలగాల అణచివేత, అక్రమ నిర్బంధాలు, అధిక బలప్రయోగంపై ఆరుగురు అమెరికా డెమోక్రటిక్ చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సీజేపీకి మద్దతుగా అమెరికాలో ఆందోళనలు నిర్వహించిన నిరసనకారులపై నిఘా పెట్టేందుకు యూఎస్‌లోని భారత రాయబార కార్యాలయం, ఇతర అమెరికా నగరాల్లోని కాన్సులేట్లు ఫొటోగ్రాఫర్లను నియమించాయని ఆరోపించారు. ఈ మేరకు త్వరలో భారత పర్యటనకు రానున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు డెమోక్రటిక్ చట్టసభ సభ్యులు ప్రమీలా జయపాల్, జేమ్స్ పి. మెక్‌గవర్న్, ఇల్హాన్ ఒమర్‌ సహా ఆరుగురు లేఖ రాశారు. భారత పర్యటన సమయంలో ఢిల్లీ, ఇతర ప్రదేశాల్లో విద్యార్థుల నిరసనల సందర్భంగా అధిక బలప్రయోగం జరిగిందన్న ఆరోపణలను భారత ప్రతినిధుల ఎదుట ప్రస్తావించాలని మార్కో రూబియోను అమెరికా డెమోక్రటిక్ చట్టసభ సభ్యులు కోరారు. తమ లేఖలో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా జరిగిన సీజేపీ నిరసనలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ జరుగుతున్న ఆందోళనల్లో నిరసనకారులపై మితిమీరిన బలప్రయోగానికి ఉదాహరణలుగా ఆ చట్టసభ సభ్యులు ఉదహరించారు.

అలాగే సర్‌ ప్రక్రియలో భాగంగా భారతదేశంలో ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్ల మంది ఓటర్లను తొలగించడంపై ప్రమీలా జయపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. సీఈసీ విషయంలో ఆందోళన చేపడుతున్న కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలిపారు. 'ఆ ఆంశాలపై భారత అధికారులతో చర్చించాలి' "ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాలలో విద్యార్థుల నిరసనల సందర్భంగా భద్రతా దళాలు అణచివేత, అక్రమ నిర్బంధాలు, మితిమీరిన బలప్రయోగం వంటి పద్ధతులపై మేము ఆందోళనతో ఈ లేఖ రాస్తున్నాం. నిరసనలపై చట్ట అమలు చర్యలకు సంబంధించి జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై సమగ్రమైన, పారదర్శకమైన, స్వతంత్రమైన దర్యాప్తును ప్రారంభించేలా భారత ప్రభుత్వంపై మార్కో రూబియో ఒత్తిడి తేవాలి. భారత, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా నిర్బంధించిన వ్యక్తులను విడుదల చేయాలి. సీజేపీకి మద్దతుగా అమెరికాలో ఆందోళనలు చేపట్టిన నిరసనకారులపై భారత దౌత్య కార్యాలయాలు నిఘా పెట్టాయి. అలాగే నిరసనకారులను భయపెట్టాయని వచ్చిన నివేదికలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా సమావేశ, భావప్రకటనా స్వేచ్ఛ హక్కులను ప్రోత్సహించి, పరిరక్షించాల్సిన బాధ్యత అమెరికా, భారత్‌కు ఉంది. రాబోయే రోజుల్లో భారత అధికారులతో సమావేశమైనప్పుడు యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఆ స్వేచ్ఛలకు, మానవ హక్కులకు చర్చించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి" అని మార్కో రూబియోకు అమెరికా చట్టసభ్యులు లేఖ రాశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్