Magazines

ఐదు రోజులకే పదవి ఊడింది

1 గంట క్రితం

position
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 2 నిమిషాల చదవడం

వైట్‌హౌస్‌ పత్రికా కార్యదర్శికి ఉద్వాసన

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షభవనం పత్రికా కార్యదర్శిగా నియమితురాలైన కేటీ జకారియాకు ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కేవలం ఐదు రోజులు మాత్రమే పదవిలో ఉన్న ఆమెను దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇంటికి సాగనంపారు. వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీగా అతి తక్కువ కాలం పనిచేసిన రికార్డు జకారియాదే. జకారియా నిర్వహించిన తొలి మీడియా సమావేశం కేవలం 14 నిమిషాలకే ముగియడం, మీడియా నుంచి వ్యతిరేకత రావడం, ఆమె న్యాయ విద్యార్హతలపై వివాదం చెలరేగడం ఈ పరిణామానికి కారణం. మధ్యంతర ఎన్ని కలు సమీపిస్తున్న తరుణం లో ప్రభుత్వ వాదనలను బలంగా ప్రజలలోకి తీసుకొని వెళ్లాల్సిన పత్రికా కార్యదర్శిని ఇంటికి సాగనంపడం గమనార్హం. నీవే నిర్ణయించుకోమని చెప్పా : ట్రంప్‌ పదవిలో కొనసాగాలా వద్దా అనేది నిర్ణయించుకోవాల్సిందిగా జకారియాకు సూచించానని ట్రంప్‌ అంతకు ముందు చెప్పారు. 'నువ్వు సంతోషంగా ఉండడమే మంచిదని ఆమెకు చెప్పాను. ఈ పనిలో నువ్వు సంతోషంగా ఉంటావో లేదో నాకు తెలియదు. ఇదేమీ తేలికైన పని కాదు' అని జకారియాతో అన్నానని తెలిపారు. జకారి యాతో మరోసారి మాట్లా డతానని కూడా ట్రంప్‌ చెప్పారు.

అయితే ఆ వెంటనే ఆమెను పదవి నుంచి తొలగించినట్టు శ్వేతసౌ ధం అధికారులు వెల్లడించారు. బార్‌ పరీక్షలో పాస్‌ అవలేదు : 
అంగీకరించిన జకారియా కరోలిన్‌ లీవిట్‌ స్థానంలో జకారియాను ప్రెస్‌ సెక్రె టరీగా ట్రంప్‌ ఇటీవలే నియమించుకఁన్నారు. ఈ నెల 12న ఆమె బాధ్యతలు చేపట్టారు. ఆ మరునాడే పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆమె గతంలో న్యాయవాదిగా పనిచేశారనే విషయంపై విలేకరులు ప్రశ్నించారు. తాను అంతర్జాతీయ లావాదేవీల చట్టానికి సంబంధించిన వృత్తిలో పనిచేసానని, అందుకు అవసరమైన అర్హతలు ఉన్నాయని ఆమె బదులిచ్చారు. అయితే అమెరికాలోని ఏ రాష్ట్రంలోనూ ఆమె న్యాయవాదిగా నమోదైనట్టు ఆధారాలు లభించలేదు. తాను బార్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జకారియా అంగీకరించారు. ఇదిలావుంటే జకారియా మీడియా సమావేశంపై ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ట్రంప్‌తో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని జకారియా చెప్పారు. ఈ సందర్భంగా ఆమె ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్