‘కోర్ట్’తో బ్లాక్‌బస్టర్ పెయిర్‌గా నిలిచిన హర్ష్ రోషన్, శ్రీదేవీ జంట మళ్లీ ‘బ్యాండ్ మేళం’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానుంది.
రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఈనెల 26న రిలీజ్ చేయబోతున్నారు.
ఈ క్రమంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైటర్ విజయేంద్ర ప్రసాద్, డైరెక్టర్స్ వివి వినాయక్, బాబీ, నటుడు, నిర్మాత బండ్ల గణేష్, గీత రచయిత చంద్రబోస్, హీరో శ్రీ విష్ణు, నిర్మాత సురేష్ బాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ,’ఈ మూవీని చూస్తుంటే పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కోనలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌ని చాలా అరుదుగా చూస్తుంటాం’ అని అన్నారు.’హరీష్, బాబీ, గోపీచంద్ మలినేని, శివ నిర్వాణ, సతీష్ జవ్వాజి కథలు చెప్పినప్పుడు వారిలోని ప్యాషన్ చూసి అవకాశం ఇచ్చాను. సతీష్ చెప్పిన కథ విన్న తరువాత రోషన్, శ్రీదేవీ అయితేనే పర్‌ఫెక్ట్‌గా ఉంటారని అనుకున్నాను. ‘కోర్ట్’తో ఆ ఇద్దరూ తమ తమ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ‘బ్యాండ్ మేళం’ నా కోసం చూడండి. నచ్చకపోతే ఇంకోసారి నేను రాసిన సినిమాని చూడకండి. నా కూతుర్లైన కావ్య, శ్రావ్యలకి సినిమాల పట్ల ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను నిర్మాతగా నా పేరు కాకుండా వాళ్ల పేర్లు పెట్టాను. హిస్టరీ ఛేంజ్ అవుతుందని వాళ్ల పేర్లు పెట్టాను. ఈ మూవీ క్లైమాక్స్ అందరినీ కదిలిస్తుంది’అని నిర్మాత, రైటర్ కోన వెంకట్ చెప్పారు.
భావోద్వేగభరితంగా క్లైమాక్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



