కరీంనగర్ జిల్లాలో పుట్టి, అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన జయశ్రీ.. చిన్ననాటి నుంచే సేవాభావం కలిగిన వ్యక్తిత్వం ఆమెది. సమాజం పట్ల మమకారం, బాధ్యతాభావం ఆమె అడుగడుగునా కనిపిస్తుంది. వెంకటేశ్వరరావుతో వివాహం తర్వాత కూడా ఆమె సేవా ప్రయాణం ఆగలేదు. పైగా మరింత విస్తరించింది. ‘బడుగు బలహీన వర్గాలు బాగుంటేనే సమాజం బాగుపడుతుంది’ అనే మహోన్నత ఆలోచనతో ఆమె ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.
-పిల్లల చదువుల కోసం సహాయం
-పేద కుటుంబాలకు ప్రతి నెల అవసరమైన సరుకుల పంపిణీ
-అవసరమైన వారికి దుస్తుల పంపిణీ
-పాఠశాలల్లో పిల్లలకు ఆహారం, పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు
ఈ సేవలన్నీ ఆమె వ్యక్తిగత కర్తవ్యంగా భావించి ఎంతో ప్రేమతో చేస్తున్నారు. వనితా భారత్ లయన్స్ క్లబ్‌లో కోశాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఆ సంస్థ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. నాయకత్వం, నిర్వహణా నైపుణ్యం, సేవా తపన.. ఈ మూడు గుణాల సమ్మేళనం జయశ్రీని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఆమెకు సేవ ఒక కార్యక్రమం కాదు… అది ఆమె జీవన విధానం. ఆమె అడుగులు నడిచే ప్రతి చోట ఆశా వెలుగులు వెలుగుతాయి. జయశ్రీ సేవా ప్రయాణం మరింత విస్తరించి, మరెందరికో ఆదర్శంగా నిలవాలి.
- పద్మా కమలాకర్



