మావోయిస్టులకు భవిష్యత్ లేదు
నగర ట్రాఫిక్‌ను సరిదిద్దడానికి కృషి
పోలీసుశాఖను ప్రజలకు మరింత చేరువ చేస్తా : నవతెలంగాణతో కొత్త డీజీపీ శివధర్‌రెడ్డి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
”రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, సైబర్ నేరాలను ఉక్కుపాదంతో అణచివేస్తా. మావోయిస్టులకు భవిష్యత్ లేదు. తీవ్రరూపం దాల్చుతున్న ట్రాఫిక్ సమస్యకు తగిన పరిష్కారాన్ని కనుక్కుంటాం. పోలీస్‌శాఖ పట్ల ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటా. అందుకు అవసరమైన బేసిక్ పోలీసింగ్ విధానాన్ని ముందుకు తీసుకెళ్తా” అని రాష్ట్ర కొత్త డీజీపీగా అక్టోబర్ 1న బాధ్యతలను చేపట్టనున్న రాష్ట్ర ఇంటెలిజన్స్ చీఫ్ బత్తుల శివధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధితో ఆయన పలు అంశాలపై ముచ్చటించారు. రాష్ట్ర డీజీపీగా తనపై నమ్మకం తో బాధ్యతలను అప్పగించిన ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డికి, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
మావోయిస్టులు ప్రజాస్వామ్య పథంలో నడవాలి
ఐపీఎస్ అధికారిగా ఏఎస్పీ స్థాయి నుంచి డీజీపీ హోదా వరకు పోలీస్ శాఖలోని పలు విభాగాల్లో పని చేశాననీ, ఆ అనుభవంతో ప్రభుత్వం తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా మంచి పేరును తెచ్చుకుంటానని శివధర్‌రెడ్డి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఏఎస్పీగా వైజాగ్ ఏజెన్సీ ప్రాంతంలో విధులను ప్రారంభించిననాటి నుంచి మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో పని చేసిన అనుభవం తనకు శాంతి భద్రతల పరిర క్షణలో ఉపయోగపడిందని ఆయన చెప్పారు. గత 30 ఏండ్లుగా దేశంలో వస్తున్న మార్పులు, ప్రజల సంక్షేమం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, తీసుకొస్తున్న పథకాలు అభివృద్ధికి సూచకంగా మారాయన్నారు. దాంతో ఏదైతే లక్ష్యంతో మావోయిస్టులు పని చేస్తున్నారో ఆ లక్ష్యాలు ప్రజాస్వామిక మార్గంలో నెరవేరుతూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్న దశలో వారి హింసాయుత మార్గానికి స్థానం లేకుండా పోతున్నదని ఆయన తెలిపారు. ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యులు మొదలుకొని పలువురు మావోయిస్టు నాయకులు ప్రభుత్వానికి లొంగిపోయారనీ, మిగతావారు కూడా ఆ బాటలోనే నడిచి ప్రజాస్వామ్య పథంలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
తన ఇన్నేండ్ల పోలీసు విధుల్లో ప్రజలకు చేరువై, వారి సమస్యలను తీర్చటానికి కృషి చేశాననీ, ఇకము ందు కూడా దానిని కొనసా గిస్తానని కాబోయే పోలీస్ బాస్ తెలిపారు. రాష్ట్రంలోనేగాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైబర్ నేరాలు, మాదక పదార్థాల రవాణా, వినియోగాలు మహ మ్మారిలా పరిణమించాయని వీటిపై రాష్ట్రంలో ఉక్కుపాదాన్ని మోపుతామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేసిన ఈగల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ)లు ఇలాంటి నేరాలను అరికట్ట టానికి తీసుకున్న చర్యలు జాతీయ స్థాయిలో ప్రశంసలను అందుకున్నాయనీ, ఇకముందు కూడా ఈ విభాగాలను పటిష్టపర్చి ముందుకు నడిపిస్తానని అన్నారు. ఇప్పటి వరకు పోలీసు శాఖకు సారథ్యం వహించిన డీజీపీలు శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల అదుపునకు తీసుకుంటూ వచ్చిన చర్యలు మంచి ఫలితాలనిచ్చాయనీ, తానూ వారి అడుగుజాడల్లో నడుస్తూ పోలీసు శాఖకు వన్నె తెచ్చే తీరులో నూతన వ్యూహాలకు శ్రీకారం చుడతామని శివధర్‌రెడ్డి తెలిపారు.
పోలీస్ వ్యవస్థను ముందుకు నడిపిస్తా
శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల అదుపు విషయమై రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని సమిష్టిగా ముందుకు నడిపిస్తానని చెప్పారు. శాంతియుత వాతావరణంలోనే రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు రావటం, అభివృద్ధిని సాధించగలమనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణమైన తీరులో పోలీస్ వ్యవస్థను ముందుకు నడిపిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.
అధికారుల బదిలీల్లో రాజకీయ జోక్యమున్నా…
పోలీస్ అధికారుల బదిలీల్లో రాజకీయ జోక్యాన్ని ఏ మేరకు అడ్డుకుం టారు అనే ప్రశ్నకు… ప్రజాస్వామ్యంలో ప్రజాప్ర తినిధులు నేతృత్వం వహిస్తున్న పాలనలో పోలీస్‌శాఖ కూడా ఒక భాగమనీ, కొన్ని సందర్భాల్లో వారు కోరుకున్న అధికారుల్లో ఎవరైనా సమర్థులు లేకపోతే వారి గురించి అర్థం చేయించి పోస్టింగ్‌లు ఇవ్వకుండా నచ్చజెప్పుకోవచ్చని ఆయన అన్నారు. నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యకు కేవలం పోలీస్‌శాఖ మాత్రమే పరిష్కారం చూపలేదనీ, ఇందులో జీహెచ్‌ఎంసీ, విద్యుత్, టెలికాం తదితర విభాగాలన్నీ కూడా సమిష్టిగా కలిసి వ్యూహరచన చేయటం ద్వారానే తగిన పరిష్కారాన్ని కనుక్కోగలమని చెప్పారు. విశ్వఖ్యాతి చెందుతున్న హైద రాబాద్ నగరంలోకి రాష్ట్రం నుంచేగాక ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగరీత్యా పెద్ద ఎత్తున ప్రజలు తరలివసు ్తన్నారనీ, దాంతో ట్రాఫిక్ సమస్య పెరిగిపో తున్నదని అన్నారు. దానికి తగిన విధంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ కూడా జరగాలని డీజీపీ అభిప్రాయపడ్డారు.
డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES