Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeఆటలుఅనహత్‌కు గాయం

అనహత్‌కు గాయం

- Advertisement -

రన్నరప్‌ టైటిల్‌తో సరి
బెగా(ఆస్ట్రేలియా) :
ఎన్‌ఎస్‌డబ్ల్యూ స్కాష్‌ బెగా ఓపెన్‌లో భారత యువ ప్లేయర్‌ అనాహత్‌ సింగ్‌ రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ సందర్భంగా గాయపడ్డ అనాహత్‌ అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఈజిప్టుకు చెందిన రెండో సీడ్‌ హబిబా హనీతో తుది పోరులో 1-2తో (9-11, 11-5, 11-8, 10-4)తో వెనుకంజలో నిలిచిన క్రమంలో అనాహత్‌ గాయపడింది. వరల్డ్‌ ఈవెంట్‌ ఫైనల్లో తొలిసారి బరిలో నిలిచిన అనాహత్‌ తొలి గేమ్‌ను 11-9తో కైవసం చేసుకుని దూకుడు చూపించింది. పుంజుకున్న హనీ 11-5, 11-8తో రెండు గేమ్‌లు కైవసం చేసుకుంది. టైటిల్‌ పోరుకు ముంగిట వరుస మ్యాచుల్లో అనహత్‌ సింగ్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad