Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు

అందెశ్రీ మరణం తెలంగాణకు తీరని లోటు

- Advertisement -

ప్రజానాట్య మండలి ఘన నివాళ్లు
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల 

అందెశ్రీ మరణం తెలంగాణకు తీరనిలోటని ప్రజానాట్యమండలి జోగులాంబ గద్వాల జిల్లా గౌరవ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి ఆశన్న అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించిన తెలంగాణ ఉద్యమ ఊపిరి అందెశ్రీ మృతి బాధాకరమని అన్నారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించి పాఠశాలలో చదువు లేకుండానే కవిగా రాణించారని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడని తెలిపారు. మాయమై పోతున్నడమ్మ గీతంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించిన జయ జయహే తెలంగాణను తెలంగాణ సమాజానికి అందించారని  కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -