నవతెలంగాణ – నకిరేకల్
అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ( సిఐటియు) జిల్లా మహాసభలు ఈనెల 8న నకిరేకల్ పట్టణంలోని దొడ్డయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వంటేపాక వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పొడి శెట్టి నాగమణి తెలిపారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఈ మహాసభలకు అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. మహాసభలకు టీచర్స్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి జయలక్ష్మి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి హాజరవుతున్నారు. ఈ మహాసభలో గత కార్యక్రమాలు, సాధించిన విజయాలు, హక్కులు, సంఘ నిర్మాణంపై చర్చించి భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకుంటామన్నారు.
8న నకిరేకల్ లో అంగన్వాడీల జిల్లా మహాసభలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



