Wednesday, September 17, 2025
E-PAPER
Homeజిల్లాలుసీఐటీయూలో చేరిన అంగన్వాడీలు

సీఐటీయూలో చేరిన అంగన్వాడీలు

- Advertisement -

అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
నవతెలంగాణ – పరకాల 

తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ ఆండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ లో 70 మంది చేరడం జరిగింది. నాగారం, ఊరుకొండ సెక్టార్లకు సంబంధించిన టీచర్లు, హెల్పర్స్ మంగళవారం సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ సమక్షంలో సీఐటీయూలో చేరారు. అమరధామములో జరిగిన సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ మాట్లాడుతూ.. అంగన్వాడీలను కేంద్ర ప్రభుత్వం 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ కు కేంద్ర ప్రభుత్వం క్రమంగా నిధులను తగ్గించి ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేయాలని చూస్తుందని ఆయన విమర్శించారు. ప్రీ ప్రైమరీ, పీఎం శ్రీవిద్య ను ఐసిడిఎస్ సెంటర్ల ద్వారానే నిర్వహించాలని కోరారు. అంగన్వాడీల చేత అదనపు పనులు చేయించరాదని కనీస వేతనం రూ.26వేల ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ అంగన్వాడి యూనియన్ నాయకులు కాసం లీలావతి, దుర్గం రజిత, ఎస్ కోమల, బి భాగ్యలక్ష్మి, కే కోమల, జి సుజాత, జి విజయ, కే కొమురమ్మ, జి నిర్మలతో పాటు టీచర్లు హెల్పర్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -