- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో గురువారం ఒక వ్యక్తి తన భార్యపై కోపంతో అత్తింటికి నిప్పు పెట్టిన ఘటన చోటుచేసుకుంది. జైనూర్‌కు చెందిన ముజాహిద్ బేగ్, ఎల్లాపాటార్‌కు చెందిన షమాబీ దంపతులు 9 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. పెళ్లి ఇష్టం లేదని ముజాహిద్ తరచూ గొడవలు పడటంతో 20 రోజుల క్రితం షమాబీ పుట్టింటికి వెళ్లింది. దీంతో ముజాహిద్ అత్తింటికి వెళ్లి గ్యాస్ పైపు లీక్ చేసి నిప్పంటించి పారిపోయాడు. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
- Advertisement -