Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్సవాలకు ముస్తాబైన ఆంజనేయస్వామి ఆలయం

ఉత్సవాలకు ముస్తాబైన ఆంజనేయస్వామి ఆలయం

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో ప్రఖ్యాత గాంచిన మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈనెల 2న జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయాన్ని ఘనంగా ముస్తాబు చేసింది. వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం నిర్వహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం జయంతి రోజున ఆలయాన్ని వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -